Wednesday, April 2, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన ఇవాళ రాత్రి ఖమ్మం జిల్లాలో చోటు  చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా ఏన్కూరు మండలం హిమాంనగర్ గ్రామ శివారు వద్ద బైక్ ను  బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతి చెందిన ఇద్దరు యువకులు సుజాతనగర్ మండలం,వేపలగడ్డ, నాయకులగూడెం గ్రామానికి చెందిన పోనెం వంశీ(28),మోడీ యం సాంబయ్య(23) గా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News