Monday, December 23, 2024

క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిలీ: తైపీ ఓపెన్ 2023 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ అద్భుత ప్రదర్శనతో ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో ఏడో సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్ 21-9, 21-17 తేడాతో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగిర్తో పై గెలుపొందాడు. కేవలం 36 నిమిషాల్లోనే ము గిసిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ పూర్తి ఆధిప్యం చె లాయించాడు. తిరుగులేని బేస్‌లైన్ గేమ్‌తో ప్రత్యర్థిని ఓడించి మరీ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లా డు. భారత్ నుంచి ఒకే ఒక్క ఆటగాడు మాత్రమే తైపీ టోర్నీలో పోరాడుతున్నాడు. తన తదుపరి మ్యాచ్‌లో ఐదో ర్యాంకర్ అగస్ నకాలాంగ్‌తో ప్ర ణయ్ అమీతుమీ దిగనున్నాడు. ఇక గత నెలలో జరిగిన మలేసియా మాస్టర్స్ 2023 టోర్నీలో సింగిల్స్ విజేతగా నిలిచిన ప్రణయ్.. ఇండోనేషియా ఓపెన్ సెమీఫైనల్లో ఓటమిపాలయ్యాడు.

డెన్మార్క్‌కు చెందిన టాప్ సీడ్ అక్సెల్సెన్ 21-15, 21-15 తేడాతో ఏడో సీడ్ ప్రణయ్‌ను ఓడించా డు. ఇక మరో సింగిల్స్ మ్యాచ్‌లో పారుపల్లి కశ్య ప్ 16-21, 17-21 తేడాతో తైవాన్‌కు చెందిన ఎల్‌వై సూ చేతిలో ఓటమిపాలయ్యాడు. తైపీ ఓపె న్ టోర్నీకి భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ దూరంగా ఉన్నారు. మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సిక్కి రెడ్డి, రోహన్ కపూర్ పోరు ముగిసింది. తైపీకి చెందిన చియూ హ్సి యాంగ్ – లిన్ షియో చేతిలో 13-21, 18-21 తేడాతో భారత జోడీ పరాజయంపాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News