Friday, November 22, 2024

ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పెట్టుబడి పేరుతో సైబర్ నేరస్థులు మోసం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడిపెడితే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ఆశ చూపించి నిండాముంచుతున్నారు. సైబర్ నేరస్థులు పనుక్ కంపెనీ పేరిట వెబ్‌సైట్ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా కంపెనీలో పెట్టుబడి పెడితే లక్షకు రూ.4 లక్షలు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. వీటికి ఆకర్షితులైన వారి వద్ద నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. స్కీంలో కొత్త వారిని చేర్చితే రూ.500 నుంచి రూ.1000 రూపాయలు కమీషన్ ఇస్తామని ఆశ చూపిస్తున్నారు.

ఇలా చాలామంది బాధితుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి నిండి ముంచారు. కొద్దిరోజుల నుంచి కంపెనీ వెబ్ సైట్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైన్ సిస్టమ్‌గా పది వేల మంది రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. 1000 మంది చొప్పున 10 వాట్సప్ గ్రూపులను సైబర్ క్రిమినల్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News