- Advertisement -
హైదరాబాద్: టైఫాయిడ్ కేసులు పెరిగిపోయాయని తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కలుషిత జలాలతో టైఫాయిడ్ వ్యాప్తి పెరుగుతోందని, పానీపూరి, తోపుడు బండ్లపై ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించింది. సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ప్రైవేట్ ఆస్పత్రుల హంగామా కొనసాగుతుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అనవసర పరీక్షలు చేయొద్దన్ని హెచ్చరించింది. కరోనా కట్టడిలో విజయం సాధించామని, మాస్క్ కరోనా నుంచే కాదు అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపింది. కరోనా గురించి భయపడాల్సిన పని లేదని తెలంగాణ వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. అన్ని వ్యాధుల మాదిరిగానే కరోనా ఒకటని, కరోనా వస్తే ఐదు రోజులు క్వారంటైన్‌లో ఉంటే చాలు అని పేర్కొంది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వివరించింది.
- Advertisement -