Friday, November 22, 2024

చైనాలో బెబింకా టైఫూన్ బీభత్సం

- Advertisement -
- Advertisement -

చైనాలో బెబింకా టైఫూన్ బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఉదయం 25 మిలియన్ జనాభా గల మెగా సిటీ షాంఘై నగరాన్ని ఈ టైఫూన్ తాకడంతో ప్రజాజీవితం అస్తవ్యస్తమైంది. గత 75 ఏళ్లలో ఈ నగరాన్ని తాకిన తీవ్ర తుపాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 151 కిమీ వేగంతో తుపాన్ గాలులు వీస్తుండడంతో ఆదివారం రాత్రి నుంచి అక్కడి పుడోంగ్, హాంగ్‌కియావో ఈ రెండు విమానాశ్రయాల నుంచి వందల విమానాల సర్వీసులు రద్దయ్యాయి. విమానాల ప్రయాణికులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. రైళ్లను నిలిపివేశారు. ఫెంగ్‌జియాన్ జిల్లా లోని బస్సు సర్వీసులను నిలిపివేశారు. పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఏడాది చైనాను తాకిన అతి భీకర తుపాన్లలో ఇది 13 వది. షాంఘైలో 4,14,000 మందిని ఆదివారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News