Wednesday, January 22, 2025

తీరం దాటిన మాండౌస్‌ తుపాన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాండౌస్‌ తుపాన్ రూంపంలో దక్షిణాదిన పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తమళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మాండౌస్‌ తుపాన్ మహాబలిపురం దగ్గర తీరం దాటింది. చెన్నై సహా పది జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని చెట్లు నేలకూలాయి. విమానాశ్రయం నుంచి అన్ని విమానాలు రద్దు చేశారు.

మహాబలిపురం వెళ్లే ఈసీఆర్‌ రోడ్డులో ఆంక్షలు విధించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతోపాటు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, మరో 26 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో పెనుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. చెన్నైతోపాటు 5 ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాలయసీమ దక్షిణ కోస్తా జిల్లాలలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తీరప్రాంతాల్లో ఉన్న జాలర్ల కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News