Monday, December 23, 2024

దిశను మార్చుకున్న మిచాంగ్ తుపాన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  మిచాంగ్ తుపాను దిశను మార్చుకున్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతమై ఉందని తెలిపింది. అంతేకాక అర్ధరాత్రి నెల్లూరు సమీపాన తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటిన తర్వాత భూమార్గంలో నిదానంగా ప్రయాణిస్తుందన్నది.  ఒంగోలు , విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా ప్రయాణించనుందని పేర్కొన్నప్పటికీ…. అకస్మాత్తుగా తన దిశను మార్చుకుని నెల్లూరు కావాలి మధ్యలో తీరం దాటే అవకాశం  ఉందని కూడా తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News