Tuesday, September 17, 2024

వియత్నాం యాగీమాగం

- Advertisement -
- Advertisement -

హనోయి : వియత్నాంలో భీకర తుపాన్ ‘యాగి’ పెను విలయం సృష్టించింది. సూపర్ టైఫూన్‌గా పేర్కొంటున్న ఈ ప్రకృతి వైపరీత్యంతో కొండచరియలు విరిగిపడటం ఇతరత్రా ప్రమాదాలలో 14 మంది మృతి చెందారు. గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులకు ఉత్తర వియత్నాం అల్లకల్లోలం అయింది. పెద్ద పెద్ద వృక్షాలు కూకటివేళ్లతో కూలాయి. పలు చోట్ల పలు భవనాలు, విద్యుత్ , మంచినీటి సరఫరా కేంద్రాలకు విఘాతం ఏర్పడింది. వందలాది మంది వరకూ గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం వియత్నాంలోని పర్వత ప్రాంతం అయిన హో బిన్ ప్రాంతంలో తుపాన్ ధాటికి ఓ కుటుంబంలోని నలుగురు చనిపోయారు.

శనివారం ఈ యాగి తుపాన్ భీకర గాలులతో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు వియత్నాం ప్రాంతాలను చుట్టుముట్టింది. 4వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండు రోజుల వ్యవధిలో చైనా, తరువాత వియత్నాంల్లో అత్యంత శక్తివంతమైన తుపాన్ తలెత్తడంతో, ప్రత్యేకించి కొండప్రాంతాల్లోనే వైపరీత్యాలు జరగడంతో పర్యావరణపరంగా ఆందోళన నెలకొంది. చైనాకు ముందు ఈ తుపాన్ పిలిఫ్పీన్స్‌లోనూ విలయం సృష్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News