Friday, December 20, 2024

ఏప్రిల్‌లో టైరనోసారస్ అస్థిపంజరం వేలం?

- Advertisement -
- Advertisement -

67 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ తెగకు చెందిన టైరనోసారస్ అస్థిపంజరం స్విట్జర్లాండ్‌లో వచ్చేనెల ఏప్రిల్‌లో వేలం కానున్నది. ఐరోపాలో ఇలాంటి అమ్మకం జరగడం ఇదే మొదటిసారి. 3.9 మీటర్ల ఎత్తులో ఉండే ఈ టైరనోసారస్ అస్థిపంజరం విలువ 6.5 మిలియన్ డాలర్ల నుంచి 8.7 మిలియన్ డాలర్ల విలువ ఉంటుందని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న టైరనోసారస్ అస్థిపంజరాల్లో ఇదొకటి. ప్రేక్షకులకు అత్యంత ఆసక్తి కలిగించే కళేబరం.

ఈ శిలాజాన్ని అత్యంత జాగ్రత్తగా భద్రపరిచారు. 2021లో ఈ టైరనోసారస్ డైనోసార్లపై అధ్యయనం జరిగింది. ఈ టైరనోసారస్ పెద్ద అస్థిపంజరాలు కేవలం 32 మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. ఈ టైరనోసారస్‌లు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిపై నడయాడుతూ ఆహారం కోసం వేటాడేవి. ప్రస్తుతం వేలానికి వెళ్తున్న ట్రినిటీ అస్థిపంజరం మూడు టిరెక్స్ నమూనాల నుంచి సేకరించిన ఎముకలతో తయారైంది. ఈ అస్థిపంజరాలు అమెరికా లోని మోంటానా, వైయోమింగ్ లోని హెల్‌క్రీక్, లాన్స్‌క్రీక్ ప్రాంతాల్లో , 2008 నుంచి 2013 మధ్య కాలంలో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమయ్యాయి.

ఇటీవల కాలంలో డైనోసార్, ఇతర శిలాజాల వేలం అమ్మకాల్లో కొన్ని వేల మిలియన్ డాలర్ల ధర పలుకుతుండడం పరిపాటిగా వస్తోంది. పరిశోధకుల పరిశోధనలకు అందకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇవి వెళ్తుండడం సైన్సుకు ముప్పు కలిగించడమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News