Wednesday, January 22, 2025

మాస్, యాక్షన్ అవతార్‌లో ‘టైసన్ నాయుడు’…

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు కాగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్‌ను బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ను బాక్సింగ్ ఎక్స్‌పర్ట్, లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా పరిచయం చేసే గ్లింప్స్ ప్రేక్షకులని కట్టిపడేసింది. దర్శకుడు సాగర్ కె చంద్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను మునుపెన్నడూ లేని మాస్, యాక్షన్ అవతార్‌లో చూపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News