దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ లో శనివారం బంగ్లాదేశ్ జట్టుతో భారత్ ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఉదయ్ సహరన్ నేతృత్వంలో టీమిండియా బరిలోకి దిగుతోంది.
అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశలో పాయింట్ల పట్టిక ఆధారంగా 12 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ నుంచి నాలుగు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు 41 మ్యాచ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరి 11న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఐసిసి మెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా హవా కొనుసాగినట్లే అండర్ 19 వన్డే ప్రపంచకప్‌లలో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
అండర్ 19 వన్డే వరల్డ్ లో టీమిండియాలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ కైఫ్ వంటి ఆటగాళ్లు అండర్ 19 నుంచి టీమిండియాలోకి వచ్చారు.