Wednesday, January 22, 2025

అండర్19 ప్రపంచకప్ ఫైనల్: టీమిండియా బౌలింగ్..

- Advertisement -
- Advertisement -

బెనోని: అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి భారత్-ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్ వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది.

ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. తుది పోరులో ఆస్ట్రేలియాను ఓడించి ఆరో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో రెండు సార్లు ఫైనల్‌లో భారత్ తలపడింది. రెండు సార్లు టీమిండియానే విజయం సాధించింది. ఈసారి కూడా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలువాలనే లక్ష్యంతో పోరుకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News