Monday, December 23, 2024

అండర్-19 టీ20 ఉమెన్స్ ప్రపంచకప్ షెడ్యూల్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

అండర్-19 టీ20 మహిళల ప్రపంచకప్ షెడ్యూల్‌ విడుదల అయ్యింది. మలేసియా వేదికగా 2025లో జరగనున్న ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఆదివారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసింది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీ పడనున్నాయి.

గ్రూప్-Aలో ఇండియా, విండీస్, శ్రీలంక, మలేసియా ఉన్నాయి. గ్రూప్ Bలో ఇంగ్లండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, USA ఉన్నాయి.
గ్రూప్ Cలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫైయర్, సమోవాలు ఉన్నాయి. గ్రూప్ Dలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫైయర్, స్కాట్లాండ్ లు ఉన్నాయి.

కాగా.. ఈ మెగా టోర్నీలో జనవరి 18 నుంచి 24 గ్రూప్ దశ, 25 నుంచి 29 వరకు సూపర్ సిక్స్, 31న రెండు సెమీ ఫైనల్స్(ఫిబ్రవరి 1 రిజర్వ్ డే), ఫిబ్రవరి 2న ఫైనల్ మ్యాచ్(3న రిజర్వ్ డే) జరగనున్నట్లు ఐసీసీ తెలిపింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియా తన తొలి మ్యాచ్ లో జనవరి 19న వెస్టిండీస్‌తో తలపడనుంది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News