Sunday, December 22, 2024

అమెరికా రక్షణ మంత్రి ఆసుపత్రిలో చేరిక

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : డిసెంబర్‌ల ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు బయటపడిన అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ‘అత్యవసర బ్లాడర్ సమస్య’తో ఆదివారం తిరిగి ఆసుపత్రిలో చేరినట్లు పెంటగాన్ వెల్లడించింది. ఆస్టిన్‌ను ఆయన భద్రత పోలీసులు ఆదివారం మధ్యాహ్నం సుమారు 2.20 గంటలకు వాల్టర్ రీడ్ జాతీయ సైనిక వైద్య కేంద్రానికి తరలించారని పెంటగాన్ తెలియజేసింది. తన అధికార విధులను నిర్వర్తించాలని తొలుత భావించిన ఆస్టిన్ ఆదివారం సాయంత్రం దాదాపు 5 గంటలకు వాటిని రక్షణ శాఖ ఉప మంత్రి కేథ్లీన్ హిక్స్‌కు వదలీ చేశారని, ఆదివారం సాయంత్రం ఆయన ఆసుపత్రిలోనే ఉండిపోయారని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ తెలిపారు.

సైనిక దళాల సంయుక్త అధిపతికి, వైట్ హౌస్‌కు, కాంగ్రెస్‌కు కూడా ఈ సమాచారం అందజేశారు. తన క్యాన్సర్ లక్షణాల వెల్లడి గురించి గానీ, కొన్ని వారాల పాటు ఆసుపత్రిలో ఉండవలసి రావడం గురించి గానీ ఆస్టిన్ అధ్యక్షుడు జో బైడెన్‌కు, కాంగ్రెస్‌కు లేదా తన శాఖ ఉప మంత్రి ఆదిలో తెలియజేయలేదు. ఉక్రెయిన్ కాంటాక్ట్ గ్రూప్‌తో సమావేశం కోసం ఆస్టిన్ మంగళవారం బ్రస్సెల్స్‌కు వెళ్లవలసి ఉంది. అయితే, ఆయన ఇప్పుడు ఆసుపత్రిలో చేరినందున ఆ ప్రణాళికలో మార్పు ఉంటుందా అన్నది వెంటనే స్పష్టం కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News