రష్యా అధ్యక్షుడ పుతిన్ విమర్శ
మాస్కో: అఫ్ఘానిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు తిష్టవేసిన అమెరికా సైన్యం సాధించింది శూన్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శించారు. అఫ్ఘానిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు తన సైనిక బలగాలను మోహరించి అక్కడి ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలతోపాటు అక్కడి సమాజానికి రాజకీయ వ్యవస్థను అందచేయడానికి అమెరికా ప్రయత్నించిందని బుధవారం పుతిన్ తెలిపారు. అయితే దీని ఫలితాలు విషాదాంతాలని, అమెరికాతోపాటు అప్ఘాన్ ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయారని, ప్రతికూలత కాకపోయినప్పటికీ ఫలితాలు మాత్రం శూన్యమని ఆయన వ్యాఖ్యానించారు. బయటి నుంచి ఎవరినైనా ప్రభావితం చేయడం అసాధ్యమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఎవరికైనా ఏదైనా చేయదలిస్తే అవతలివారి చరిత్రను, సంస్కృతిని, అక్కడి ప్రజల జీవన సిద్ధాంతాలను, వారి సాంప్రదాయాలను సమగ్రంగా అర్థం చేసుకోవలసి ఉంటుందని ఆయన చెప్పారు.