Monday, December 23, 2024

సముద్రంలో కూలిన హెలికాప్టర్..ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సముద్రంలో హెలికాప్టర్ కుప్ప కూలిన ఘటనలో ఐదుగురు సైనికులు మృతి చెందిన సంఘటనా ఈ నెల 10న చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. అమెరికాకు చెందిన ఆర్మీ హెలికాప్టర్ నవంబర్ 10న రోజువారీ సైనిక శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత మెలికాప్టర్ లో సమస్య తలెత్తి మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మృతి చెందినట్లు అమెరికా అధికారులు ఆదివారం వెల్లడించారు. సైనికుల మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండా ఉండేందుకు మధ్యధార ప్రాంతంలో అమెరికా ఒక ఆర్మీ బృందాన్ని మోహరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News