Sunday, November 17, 2024

ఇంధనం లీక్‌తో చంద్రునిపై ల్యాండింగ్ వైఫల్యం

- Advertisement -
- Advertisement -

కేప్‌కెనవెరాల్ :దాదాపు 50 ఏళ్ల తరువాత చంద్రుడి పైకి ల్యాండర్‌ను పంపాలని అమెరికా చేసిన ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే . ఇంధన లీకేజీ కారణంగా పెరిగ్రిన్ వ్యోమనౌక ప్రయోగాన్ని విరమించుకోవలసి వచ్చింది. ప్రొపెల్లెంట్ లీక్ వల్ల దురదృష్టవశాత్తు చంద్రునిపై పెరిగ్రిన్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఇక అవకాశం లేదని పెరిగ్రిన్ తయారీ సంస్థ ఆస్ట్రోబోటిక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 23న చంద్రునిపై ల్యాండింగ్‌కు ఆస్ట్రోబోటిక్ లక్షంగా పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. ఇక హోస్టన్ కంపెనీకి చెందిన రెండో ల్యాండర్ ప్రయోగం ఫిబ్రవరిలో జరగనుంది. ఇప్పటివరకు కేవలం నాలుగు దేశాలే విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ చేయగలిగాయి.

వచ్చే సంవత్సరం లోగా తరువాతి మిషన్‌కు సంబంధించి అంతరిక్షంలో వీలైనంతవరకు ల్యాండర్‌ను ఎక్కువసేపు ఆపరేట్ చేయడమే కొత్త లక్షంగా ఆస్ట్రోబోటిక పేర్కొంది. సూర్యుని అభిముఖంగా వ్యోమనౌకను నిర్వహించేలా ,బ్యాటరీ పూర్తి ఛార్జి ఉండేలా వ్యవస్థలు నియంత్రించేలా చూస్తామని వివరించింది. అయితే పెరిగ్రిన్ ల్యాండర్ ప్రొపెల్లంట్ వ్యవస్థ ఎందుకు వైఫల్యం చెందిందో ఆ సంస్థవివరించలేదు. ఈ వైఫల్యంతో నాసా భవిష్యత్తులో చేపట్టే చంద్రయాత్రలను వాయిదా వేయాల్సి వచ్చింది. చంద్రుని చుట్టూ కక్షలో తిరిగేందుకు ఈ ఏడాది చివర్లో నలుగురు వ్యోమగాములను పంపాలని లక్షంగా పెట్టుకున్న నాసా ఈ వైఫల్య అనుభవంతో ఆ ప్రయోగాన్ని 2025కు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News