Saturday, November 23, 2024

అన్ని టీకాల నమోదుకు త్వరలో యువిన్ పోర్టల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొవిడ్ టీకాల నిర్వహణకు రూపొందించిన కొవిన్ మాదిరిగానే దేశం లోని యూనివర్శల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ( యుఐపి) కోసం అంటే అన్ని టీకాల కార్యక్రమాలను నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యువిన్ అనే పోర్టల్‌ను తయారు చేసింది. మామూలు టీకా కార్యక్రమాలు కూడా ఇందులో ఎలక్ట్రానిక్ రిజిస్టర్ అవుతాయి. గర్భిణిస్త్రీలను నమోదు చేసి వారికి వారి పిల్లలకు టీకాలు వేయడానికి, ఈ వ్యాక్సినేషన్ వివరాలను నమోదు చేయడానికి ఈ ప్లాట్‌ఫారం వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ యువిన్ ప్రోగ్రామ్ ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో రెండు జిల్లాల వంతున పైలట్ మోడల్‌గా నిర్వహిస్తున్నారు. ఈ యువిన్ దేశం మొత్తం మీద 65 జిల్లాల్లో జనవరి 11న ప్రారంభమైంది.

ఇప్పటివరకు యుఐపి కింద వ్యాక్సినేషన్ రికార్డులన్నీ సిబ్బందే నిర్వహిస్తున్నారు. ఇకనుంచి ఈ రికార్డులన్నీ డిజిటల్ చేస్తారు. ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ అప్‌డేట్ చేస్తారు. ప్రస్తుతం అనేక రకాల టీకాలను,డోసులను నిర్వహించడం కష్టంగా ఉంటోంది. టీకా ఫాలోఅప్‌లు, టీకా సర్టిఫికెట్‌లకు సంబంధించి మొత్తం సమాచారం ఇందులో ఉంటుంది. గర్భిణుల, వారి పిల్లల, వ్యాక్సిన్ నమోదు, టీకాలకు సంబంధించిన కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఎబిహెచ్‌ఎ ఐడి) కార్డుతో అనుసంధానం అయి ఉంటుంది. దీనిద్వారా పౌరులు సాధారణ టీకా కార్యక్రమాలను, అపాయింట్‌మెంట్లను, చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఇ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ చిత్రాలు ఉంటాయని చెప్పారు. యువిన్ పోర్టల్ కింద ఆగస్టు 28 వరకు 13 మిలియన్ వ్యాక్సిన్ డోస్‌లు రికార్డు అయ్యాయి. 6.8 మిలియన్ లబ్ధిదారులు నమోదయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News