- Advertisement -
దుబాయ్: ఐసిసి అండర్ 19 ఆసియా కప్ మ్యాచ్‌లోనే భారత్ ఓటమిపాలైంది. డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్.. దాయాది పాకిస్థాన్ చేతిలో 8వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దుబాయ్‌లోని ఐసిసి అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్కాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 259 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాక్ కేవలం 47 ఓవర్లలోనే ఛేదించింది.
భారత బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ (81 బంతుల్లో 62, 4×4, 1×6), కెప్టెన్ ఉదయ్ సహరన్ (98 బంతుల్లో 60, 5×4), సచిన్ దాస్(42 బంతుల్లో 58, 2×4, 3×6) రాణించారు. మిగతా బ్యాటర్లు పాక్ బౌలర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. పాక్ బౌలర్లలో మహ్మద్ జీషన్ 4 వికెట్లతో చెలరేగగా అమీర్ హసన్, ఉబైద్ షాలు చెరో రెండు వికెట్లు పడగొట్టి, పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.
- Advertisement -