Sunday, December 22, 2024

అండర్19 ప్రపంచకప్‌: బోణీ కొట్టిన భారత కుర్రాళ్లు..

- Advertisement -
- Advertisement -

బ్లొయెమ్‌ఫౌంటెన్: అండర్19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో భారత్ 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆదర్ష్ సింగ్, కెప్టెన్ ఉదయ్ శరణ్ జట్టును ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆదర్ష్ సింగ్ ఆరు ఫోర్లతో 76 పరుగులు చేశాడు.

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఉదయ్ 4 ఫోర్లతో 64 పరుగులు సాధించాడు. ప్రియాన్షు (23), అవనీష్ (23), సచిన్ దాస్ (26) నాటౌట్ తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో కేవలం 167 పరుగులకే కుప్పకూలింది. ఆరిఫుల్ ఇస్లాం (41), మహ్మద్ షిహాబ్ (54) మాత్రమే రాణించగా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో సౌమీ పాండే నాలుగు, ముషీర్ ఖాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News