Monday, January 20, 2025

అండర్-19 మహిళల టి20 ప్రపంచకప్: శ్రీలంకపై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

సెన్యూస్‌పార్: అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ భారత అమ్మాయిల జట్టు 7వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన భారతజట్టు బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి కేవలం 59పరుగులు మాత్రమే చేసింది.

మన బౌలర్లులో పర్సావీ చోప్రా 4వికెట్లుతో మెరవగా, కాశ్యప్ 2, సాధు, అర్చనాదేవీ చెరో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష ఛేదనలో భారత్ 7.2 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి చేసి విజయం సాధించింది. కెప్టెన్ షెఫాలీ వర్మ షెరావత్(13), వికెట్‌కీపర్(4) స్కోరు చేయగా సౌమ్య తివారీ 5ఫోర్లుతో 28పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News