Tuesday, December 24, 2024

మహిళల అండర్19 టీ20 ప్రపంచకప్: ఫైనల్ లో ఇంగ్లండ్, భారత్ టైటిల్‌ పోరు

- Advertisement -
- Advertisement -

పొచెఫ్‌స్ట్రూమ్: మహిళల అండర్19 టి20 ప్రపంచకప్ ఫైనల్ సమరానికి భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న భారత యువ టీమ్ ట్రోఫీపై కన్నేసింది. ఆదివారం జరిగే తుది పోరులో ఇంగ్లండ్‌తో షఫాలీ వర్మ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. కివీస్‌ను ఓడించి భారత్, ఆస్ట్రేలియాను కంగుతినిపించి ఇంగ్లండ్ టైటిల్ పోరుకు దూసుకొచ్చాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు.

భారత జట్టులో పార్షవి చోప్రా అసాధారణ బౌలింగ్‌తో అలరిస్తోంది. ప్రతి మ్యాచ్‌లోనూ పార్షవి మెరుగైన బౌలింగ్‌ను కనబరుస్తోంది. ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. షెఫాలీ వర్మ, శ్వేత సెహ్రావత్, సౌమ్య తివారీ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక ఇంగ్లండ్‌లోనూ ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రీడాకారిణిలు ఉన్నారు. దీంతో తుది పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News