Friday, April 4, 2025

ముషీర్ ఖాన్ శతకం.. యువ భారత్‌కు రెండో విజయం

- Advertisement -
- Advertisement -

బ్లొయెమ్‌ఫాంటెన్: అండర్19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో టీమిండియా 201 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 29.4 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది.

డానియల్ ఫోర్కిన్ 27 (నాటౌట్), ఒలివర్ రిలే (15), ఓపెనర్లు జోర్డాన్ నీల్ (11), రియాన్ హంటర్ (13) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో నమన్ తివారీ నాలుగు, సౌమి పాండే మూడు వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను ముషీర్ ఖాన్ (118) సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్ ఉదయ్ శరణ్ (75) తనవంతు పాత్ర పోషించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News