Wednesday, January 22, 2025

దుబాయ్ లో పుకార్లు పుట్టించినా, సైబర్ నేరాలకు పాల్పడినా శిక్ష తీవ్రం

- Advertisement -
- Advertisement -

 

DUBAI LAW

దుబాయ్: యూఏఈలోని ఫెడరల్ డిక్రీ లా నెం. 34లోని ఆర్టికల్ 55 ప్రకారం.. పుకార్లు సృష్టించడం, సైబర్ నేరాలకు పాల్పడటం నేరం. ఎవరైనా ఈ నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ అవగాహన వీడియోను అధికారులు విడుదల చేశారు. చట్టవిరుద్ధమైన, అసత్య ప్రచారాన్ని వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ అకౌంట్లలో పోస్ట్ చేయాలని కోరడం, ప్రచురించడం రెండూ తప్పే. ఇటువంటి చర్యల ద్వారా లబ్ధి పొందే వ్యక్తులు చట్ట ప్రకారం శిక్షార్హులు. ఈ  నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం సదరు వ్యక్తులు దాదాపు రూ.4 కోట్ల (2 మిలియన్ల దిన్హార్లు) వరకు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. సదరు కంటెంట్‌ను ప్రచురించిన ఆన్‌లైన్ అకౌంట్, వెబ్‌సైట్ నిర్వాకులతోపాటు.. అటువంటి సమాచారం అలాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటన స్థలాన్ని అద్దెకు తీసుకున్న లేదా కొనుగోలు చేసే ఏ వ్యక్తికైనా అదే పెనాల్టీ వర్తిస్తుందని అధికారులు వీడియోలో స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News