Wednesday, January 22, 2025

తొలి పవిత్ర ఖురాన్ టివి ఛానెల్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: షార్జా అధికారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) తొలి పవిత్ర ఖురాన్ టివి ఛానల్ ను ఆగస్టు 16న(శుక్రవారం) ఆవిష్కరించారు. ‘‘అల్లాహ్ తో ఉండండి, అల్లాహ్ మీతో ఉండడం చూస్తారు’’(బీ విత్ అల్లాహ్ అండ్ యు విల్ సీ అల్లాహ్ విత్ యు) అనే స్లోగన్ తో ఈ టివి ఛానెల్ ఉంటుంది.

షేఖ్  డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశాల మేరకు ఈ ఛానెల్ ప్రారంభించారు. షార్జా బ్రాడ్ కాస్టింగ్ అథారిటీ లో ఇదో భాగం. ఈ ఛానెల్ నిరంతరం (24/7) అందుబాటులో ఉంటుంది. ఖురాన్ పఠనం, అధ్యయనం, ఉపన్యాసాలు, శుక్రవారం నమాజ్ లు, రంజాన్ నెలలో తారావీ, ఖియమ్ నమాజ్ లను కూడా ఈ టివి ఛానెల్ ప్రసారం చేస్తుంది. ఆధ్యాత్మిక అంశాలపై షార్ట్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ లను కూడా అందిస్తుంది. సాధారణ ప్రజానికి మరింత చేరువ కావడానికి ఈ టివి కృషి చేయనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News