Wednesday, November 6, 2024

జర్నలిస్టులపై యుఎపిఎ చట్టం తగదు: ఎడిటర్స్ గిల్డ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జర్నలిస్టులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని(యుఎపిఎ) ప్రయోగించడం పట్ల ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఇజిఐ) బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామిక విలువలను గౌరవించాలని, జాతీయ భద్రత పేరుతో జర్నలిస్టులపై వేధింపులు ఆపాలని ప్రభుత్వానికి ఎడిటర్స్ గిల్డ్ విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టులపై యుఎపిఎ చట్టాన్ని విచ్చలవిడిగా వాడడం పట్ల ఎడిటర్స్ గిల్డ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఇటీవలే కశ్మీరుకు చెందిన ఇర్ఫాన్ మెహ్రాజ్ అనే జర్నలిస్టును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) అరెస్టు చేయడాన్ని గిల్డ్ గుర్తు చేసింది. మార్చి 20వ తేదీ మధ్యాహ్నం జర్నలిస్టు ఇర్ఫాన్‌తో మొబైల్ ఫోన్‌లో మాట్లాడిన ఒక దర్యాప్తు అధికారి స్థానిక ఎన్‌ఐఎ కార్యాలయానికి రావాలని కోరాడని, అక్కడకు వెళ్లిన ఇర్ఫాన్‌ను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువచ్చారని గిల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News