Monday, January 20, 2025

క్వార్టర్ ఫైనల్లో భారత్..

- Advertisement -
- Advertisement -

ఉబెర్‌కప్ బ్యాడ్మింటన్ టోర్నీ.. సింధు, ఆకాశి విజయం
క్వార్టర్ ఫైనల్లో భారత్

బ్యాంకాక్: ఇక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఉబెర్‌కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొంది. గ్రూప్‌డిలో భాగంగా మంగళవారం అమెరికాతో జరిగిన పోరులో భారత్ 4-1 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. అంతకుముందు తొలి పోరులో 4-1 తేడాతో కెనడాను మట్టికరిపించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాను కూడా చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. భారత్ విజయంలో స్టార్ షట్లర్ పి.వి.సింధు, యువ సంచలనం ఆకాశి కశ్యప్ కీలక పాత్ర పోషించారు. తొలి సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సింధు అలవోక విజయాన్ని అందుకుంది. అమెరికా షట్లర్ జెన్ని గాయ్‌తో జరిగిన పోరులో సింధు 21-10, 21-11 తేడాతో జయభేరి మోగించింది. ఇక రెండో మ్యాచ్‌లో భారత డబుల్స్ జోడీ విజయం సాధించింది. తనీషా క్రాస్టోత్రీసా జాలీ జంట 21-19, 21-10 తేడాతో ఫ్రాంసెస్కా కార్బెట్‌అల్లీసన్ లీ జోడీని ఓడించింది. తొలి సెట్‌లో భారత జోడీకి గట్టి పోటీ ఎదురైంది.

అయితే చివరి వరకు నిలకడగా ఆడిన భారత జంట విజయం అందుకుంది. రెండో సెట్‌లో మాత్రం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే గెలిచి జట్టుకు 2-0 ఆధిక్యాన్ని సాధించి పెట్టారు. ఇక రెండో సింగిల్స్‌లో ఆకాశి కశ్యప్ జయకేతనం ఎగుర వేసింది. అమెరికా షట్లర్ ఎస్తేర్ షితో జరిగిన పోరులో ఆకాశి విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన తొలి సెట్‌లో ఆకాశి 21-18 తేడాతో జయభేరి మోగించింది. ఇక రెండో సెట్‌లో అలవోకగా గెలిచి భారత్‌కు 30 ఆధిక్యాన్ని అందించింది. అయితే రెండో డబుల్స్ మ్యాచ్‌లో భారత జంట ఓటమి పాలైంది. నాలుగో మ్యాచ్‌లో సిమ్రన్ సింఘిరితికా థాకర్ జంట పరాజయం చవిచూసింది. అమెరికాకు చెందిన లారెన్ లామ్‌కోడి తాంగ్ లీ జంట 12-21, 21-17, 21-13 విజయం సాధించింది. కాగా చివరి సింగిల్స్ మ్యాచ్‌లో భారత షట్లర్ అష్మితా చాలిహా విజయాన్ని అందుకొంది. నటాలి చినితో జరిగిన మ్యాచ్‌లో అష్మితా చాలిహా 21-18, 21-13 తేడాతో జయభేరి మోగించింది. ఈ గెలుపుతో భారత్ 41 తేడాతో అమెరికాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో కొరియాతో భారత జట్టు తలపడనుంది. ఇక పురుషుల విభాగంలో భారత్ కూడా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

Uber Cup Badminton: Indian Women Team reached quarterfinals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News