బ్యాంకాక్: ప్రతిష్టాత్మకమైన ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో దక్షిణ కొరియా మహిళల టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో కొరియా 32 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చైనాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో చైనా షట్లర్ చెన్ యు ఫీ విజయం సాధించింది. కొరియా క్రీడాకారిణి అన్ సె యంగ్‌తో జరిగిన పోరులో చెన్ 1721, 2115, 2220 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌లో గెలిచిన యంగ్ తర్వాత వరుసగా రెండింటిలో ఓడి పోయింది. అయితే తర్వాత జరిగిన తొలి డబుల్స్‌లో కొరియా జోడీ జయభేరి మోగించింది. లీ సొ హీషిన్ చాన్ జోడీ మూడు సెట్ల పోరాటంలో చెన్ కింగ్‌జియా ఫాన్ జంటను ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కొరియా జోడీ 1221, 2118, 2118 తేడాతో విజయం అందుకుంది. ఇక రెండో సింగిల్స్‌లో చైనా షట్లర్ బింగ్ జియావో విజయం సాధించింది. కిమ్‌తో జరిగిన పోరులో బింగ్ 2112, 2113 తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. కానీ రెండో డబుల్స్‌లో కొరియా జోడీ విజయం సాధించింది. కిమ్ జియాంగ్‌కాంగ్ హీ యంగ్ జంట 2220, 2117 తేడాతో హువాంగ్ పింగ్‌లి వెన్ మి జోడీని ఓడించింది. దీంతో స్కోరు 22తో సమమైంది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సింగ్సిల్సలో కొరియా షట్లర్ సిమ్ యు జిన్ విజయం సాధించింది. వాంగ్‌తో జరిగిన పోరులో సిమ్ 2826, 1821, 218 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో కొరియా 32 తేడాతో ఉబెర్‌కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఉబెర్ కప్ విజేత కొరియా
- Advertisement -
- Advertisement -
- Advertisement -