Friday, November 22, 2024

లక్ష మంది ఉబెర్ డ్రైవర్లకు వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

Uber vaccinates 1 lakh drives against covid

ఢిల్లీ: లక్ష మందికి పైగా డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సిన్ (కనీసం ఒక డోస్) వేయించినట్టు ఉబెర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థలో లక్షా 50 వేల మందికి టీకా వేయించాలని లక్ష్యంగా చేసుకున్నామని సంస్థ తెలిపింది. దీని కోసం రూ.18.5 కోట్లు సంస్థ కేటాయించింది. ఉబెర్ ఇండియా సౌత్-ఏషియా అధ్యక్షుడు ప్రభుజీత్ సింగ్ మాట్లాడుతూ, కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని రుజువైందని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న డ్రైవర్లు సంస్థలో మెరుగైన భద్రతను సూచిస్తారని, ప్రయాణికులకు మరింత భద్రత ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News