Monday, December 23, 2024

ఉత్తరాఖండ్‌లో త్వరలో ఉమ్మడి పౌరస్మృతి అమలు: సిఎ: ధామి

- Advertisement -
- Advertisement -

మధుర: ఉత్తరాఖండ్‌లో త్వరలో ఉమ్మడి పౌర స్మృతి అమలవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ థామి వెల్లడించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలియజేశారు. బృందావన్‌లో వాత్సల్య గ్రామంలో శనివారం సాధ్వీరీతాంభర షష్టి పూర్తి మహోత్సవం నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ థామి ఈ ప్రకటన చేశారు. రామభక్తులపై కాల్పులకు బాధ్యులైన వారు అయోధ్యలో ఎప్పటికీ రామాలయాన్ని నిర్మించలేరని ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకుని ధ్వజమెత్తారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్గించే 370ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ రద్దు, ఇవన్నీ ప్రస్తావించారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న లక్షం జనవరి 22 న ప్రతిష్ఠాపన దినోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనబోవడం ద్వారా నెరవేరబోతోందని పేర్కొన్నారు. సాధ్వీ రీతాంభర గురించి ప్రస్తావిస్తూ రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా ఆమె ఉపన్యాసాల ద్వారా తాను స్ఫూర్తి పొందానని, ఆమె దీవెనలు, వాత్సల్యం ప్రజలకు సేవ చేయడం వైపు నడిపించాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News