Wednesday, November 20, 2024

పేదరిక నిర్మూలన కోసం యుసిడి విభాగం ప్రత్యేక రుణాలు

- Advertisement -
- Advertisement -

బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. 98.15 కోట్లు పంపిణీ
నిరుపేద దివ్యాంగులను ఆదుకునేందుకు వికాసం ద్వారా చేయూత
ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా టార్గెట్ పూర్తి చేస్తామంటున్న జిహెచ్‌ఎంసి

GHMC Mayoral elections to be held on February 11
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో నివసించే నిరుపేదలు పేదరికం నుండి విముక్తి చేసే నేపథ్యంలో వ్యాపార, వ్యాపారేతర కోసం స్వయం సహాయక సంఘాలకు అవసరమైన పెట్టుబడి కోసం సూక్ష్మరుణాలు అందించి కుటుంబ ఆర్దిక వ్యవస్దను మెరుగు పరుచుకునే విధంగా దైర్యాన్ని, విశ్వాస్వాన్ని జీహెచ్‌ఎంసీ కల్పిస్తుంది. అవసరమైన సమయంలో కావాల్సిన పెట్టుబడి అందించి పేద మహిళలకు ఆర్దిక బలోపేతం చేసి సమాజంలో గౌరవ ప్రదంగా ఉండాలనేది ప్రభుత్వ ఆశయం. ఈనేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ద్వారా ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఇప్పటివరకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.98.15 కోట్ల రూపాయలను 1735 స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించడం జరుగుతుంది. 201415 ఆర్దిక సంవత్సరం నుండి ప్రస్తుతం సంవత్సర కాలంలో ఇప్పటివరకు మొత్తం రూ.2269.37 కోట్లను బ్యాంక్ లింకేజ్ ద్వారా 68,894మంది మహిళలకు అందజేశారు. 42,165 స్వయం సహాయక గ్రూప్‌లను ఏర్పాటు చేయగా, ఆర్దిక సంవత్సరంలో ఇప్పటివరకు మరో 219 గ్రూపులను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 4,21,650మంది సభ్యులున్నారు.

వికాసం: నిరుపేద దివ్యాంగులను ఆదుకునేందుకు వికాసం అనే ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్నది. ఈకార్యక్రమం ద్వారా వివిధ రకాల దివ్యాంగులు కల్గిన మహిళలకు ఆర్దిక బలోపేతానిఇక చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మొత్తం 887 స్వయం సహాయక సంఘాల పనిచేస్తుండగా వారికి రూ.13.23 కోట్ల రూపాయల ఆర్దిక సహాయాన్ని అందించారు. ఈ ఆర్దిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 75.50లక్షల రూపాయల ఆర్దిక సహాయాన్ని 39 పి.డబ్లు. డి స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించారు. ఆర్దిక స్వాలంబన కోసం స్వయం సహాయక సంఘాలకు సూక్ష్మ రుణాలు అందించడమే కాకుండా స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలను అందించేందుకు కృషి చేస్తున్నారు. వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్దిదారులకు ఆర్దిక సహాయం అందించే నేపథ్యంలో ఈ ఆర్దిక సంవత్సరంలో సుమారు 5కోట్ల 48లక్షల రూపాయల ఆర్దిక సహాయాన్ని 957మందికి అందించాలని లక్షంగా నిర్ణయించింది. ఈపథకం టార్గెట్ సాధించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 71మంది దరఖాస్తు చేసుకోగా అందులో 20మందికి సుమారు 8లక్షల రూపాయలకు పైగా సహాయం అందించినట్లు, ఈ ఆర్దిక సంవత్సరం చివరి వరకు మిగతా లక్షాన్ని పూర్తి చేసినట్లు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News