Wednesday, January 22, 2025

భార్యను కానిస్టేబుల్ చంపి… మృతదేహాన్ని అడవిలో పడేశాడు…

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: పోలీస్ కానిస్టేబుల్ తన భార్యను ప్రియురాలితో కలిసి చంపి, మృతదేహాన్ని అడవిలో పడేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం ఉదయ్‌పూర్ జిల్లాలోని పిప్లేజ్ గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉదేపూర్‌లో వర్షన్ బాయ్ తన భార్య కెలిబెన్ ప్యారీతో జీవనం సాగిస్తున్నాడు. వర్షన్ బాయ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్య భర్తల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. పిప్లేజ్ గ్రామ శివారులో మృతదేహం కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం కెలిబిన్‌దిగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమెను కత్తితో పొడిచి చంపిన గుర్తులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వివాహేతర సంబంధం విషయంలో భార్య భర్తతో గొడవలు పెట్టుకోవడంతోనే తన సోదరిని బావ చంపి ఉంటాడని ఆమె సోదరుడు వీరేసింగ్ భాయ్ ఆరోపణలు చేశారు. తన సోదరి అంత్యక్రియలు బావ ఇంట్లోనే జరిపిస్తామని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News