Monday, December 23, 2024

బాలికపై మేనత్త కుమారులు సామూహిక అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

జైపూర్: మేనత్త ఇంటిలో 11 ఏళ్ల బాలికపై ఆమె కుమారుడు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంబమాతా థానే ప్రాంతంలో మేనత్త ఇంటికి బాలిక  వెళ్లింది. ఎవరు లేని సమయంలో మేనత్త ఇద్దరు కుమారులు బాలికపై అత్యాచారం చేయడంతో స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే బంధువులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మర్మాంగాల నుంచి రక్తస్రావం కావడంతో ఐసియులో ఉంచి చికిత్స అందించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అంబమాతా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటనపై డిఎస్‌పి చెట్న బాటి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుల వయసు 13, 15 ఏళ్లు ఉంటుంది.

Also Read: విస్కీ బాటిల్స్‌లో కొకైన్ స్మగ్లింగ్: కెన్యా యువతి అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News