- Advertisement -
న్యూఢిల్లీ : కన్స్యూమర్ టెక్ సంస్థ ఉడ్‌చలో విద్యుత్ బైక్ ‘వీర్’ను విడుదల చేసింది. ఈ కంపెనీ వాహనాన్ని పర్యావరణ అనుకూల, అందుబాటు ధరల్లో సాయుధ దళాల్లోని ప్రతి ఒక్కరికీ అందించాలనే కంపెనీ ప్రయత్నాలలో భాగమే ఇది. ఈ సైకిల్ వీర్ (విఐఆర్)కు ఫిజిక్స్‌లోని ఓమ్స్ సూత్రం వి=ఐఆర్ స్ఫూర్తి. వీర్ బైక్ కో-ఫౌండర్, ఆర్ అండ్ డి హెడ్ సాహిల్ ఉత్తేకర్ మాట్లాడుతూ, విద్యుత్ సైకిల్ వీర్ బైక్ సౌకర్యవంతమైన సవారీని అందిస్తుందని అన్నారు.
ఈ బైక్ కేవలం పర్యావరణ అనుకూలం మాత్రమే కాదు, అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకునేలా తీర్చిదిద్దామని అన్నారు. ఉడ్‌చలో సిఇఒ రవికుమార్ మాట్లాడుతూ, వీర్ బైక్ భారతదేశం నేపథ్యానికి అనుగుణంగా ఉంటుందని అన్నారు. వీర్‌బైక్ డాట్ కామ్ వద్ద అందుబాటులో ఉండే ఈ బైక్ ఒక సంవత్సర వారెంటీతో లభిస్తుంది.
- Advertisement -