- Advertisement -
ముంబయి: మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యముంటే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. ప్రజాకోర్టులో తేల్చుకుందామని శిండే ప్రభుత్వానికి సవాలు విసిరారు. నిన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్‌నాథ్ షిండే వర్గం తన బలాన్ని నిరూపించుకుంది. విశ్వాస పరీక్షలో సోమవారం 164 మంది ఎంఎల్‌ఏలు షిండేకి మద్దతుగా ఓటేసిన విషయం తెలిసిందే. సిండే నాయకత్వంలో శివసేన రెబల్ ఎంఎల్ఎలు బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విథితమే
- Advertisement -