Thursday, January 23, 2025

సిఎం కెసిఆర్ కేంద్రంపై పోరాటానికి ఉద్ధవ్ థాకరే సంపూర్ణ మద్దతు

- Advertisement -
- Advertisement -

Uddhav Thackeray fully supports CM KCR's struggle

హైదరాబాద్ : బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం, సిఎం కెసిఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ థాకరే తన సంపూర్ణ మద్దతును పలికారు. బుధవారం సిఎం కెసిఆర్ కు ఫోన్ చేసిన ఉద్ధవ్ థాకరే, దేశం కోసం సిఎం కెసిఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ” కెసిఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయం లో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగండి.మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది.ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం…” అంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ” మిమ్మల్ని ముంబై కి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భం లో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణ పై చర్చించుకుందాం..” అని సిఎం కెసిఆర్ ను ఉద్ధవ్ థాకరే ఆహ్వానించారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సిఎం కెసిఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News