Wednesday, January 22, 2025

శ్రమ ఉద్ధవ్‌ది, లబ్ధి కాంగ్రెస్, ఎన్‌సిపి(ఎస్‌పి)లది

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర బిజెపి
ముంబయి : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ థాక్కరే విశేషంగా పాటుపడినప్పటికీ మిత్ర పక్షాలు కాంగ్రెస్, ఎన్‌సిపి (ఎస్‌పి) ఆయన పార్టీ కన్నా ఎక్కువగా ప్రయోజనం పొందాయని బిజెపి నేత చంద్రకాంత్ పాటిల్ మంగళవారం వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర సీనియర్ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ముంబయిలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, థాక్కరే ఆరోగ్యంగా లేరని, కానీ బాగా కష్టపడి ప్రచారం చేశారని అన్నారు.

‘ఉద్ధవ్ థాక్కరే ఆరోగ్యం బాగుండలేదు. అయినా ఆయన విశేషంగా పాటుపడ్డారు. ఆయన ఆరోగ్యం గురించే నా ఆందోళన. అయితే, ఆయన కృషి వల్ల ఆయన సొంతపార్టీ కన్నా ఎన్‌సిపి (ఎస్‌పి), కాంగ్రెస్ ఎక్కువగా లబ్ధి పొందినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. థాక్కరే బిజెపితో ఉన్నప్పుడు ఆయన పార్టీ 18 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నది. కాంగ్రెస్, ఎన్‌సిపి(ఎస్‌పి)తో కలసి ఉన్నప్పుడు ఆయన తొమ్మిది సీట్లు మాత్రమే గెలిచారు.

ఆయన ఆత్మావలోకనం చేసుకోవలసిన అగత్యం ఉంది’ అని పాటిల్ అన్నారు. థాక్కరే నేతృత్వంలోని శివసేన (యుబిటి) రాష్ట్రంలోని 48 లోక్‌సభ సీట్లలోకి 21 సీట్లకు పోటీ చేసినా 9 మాత్రమే నెగ్గింది. మరొక వైపు కాంగ్రెస్ 17 సీట్లకు పోటీ చేసి 13 గెలుచుకున్నది. సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, తిరుగుబాటు అభ్యర్థి కూడా గెలిచారు. ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఎన్‌సిపి (ఎస్‌పి) 10 సీట్లకు పోటీ చేసి ఎనిమిది గెలుచుకున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News