ముంబయి: శివసేనలో అసమ్మతి భగ్గుమనడంతో మహారాష్ట్ర రాజకీయాలు అడుగడుగునా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు బావుటా ఎగురవేయంతో శివపేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో ఏర్పాటయిన మహావికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో భేటీ అయ్యారు. ఉద్ధవ్ థాక్రే రాష్ట్రప్రజలనుద్దేశించి ఫేప్‌బుక్ లైవ్‌లో ప్రసంగించిన కొద్ది సేపటికే ఈ సమావేశం జరగడం గమనార్హం. పార్టీ నేతలు సుప్రియా సూలే, జితేంద్ర అవద్‌తో కలిసి సిఎం నివాసానికి వెళ్లిన పవార్ దాదాపు గంట సేపు ఆయనతో మంతనాలు జరిపారు. సమావేశం అనంతరం పవార్, సూలేలతో కలిసి తన నివాసంనుంచి బైటికి వచ్చిన థాక్రే తన మద్దతుదారులకు అభివాదం చేశారు. కాగా, ఈ కీలక భేటీలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రికి పవార్, కాంగ్రెస్ సూచించినట్లు తెలుస్తోంది.
Uddhav Thackeray meets Sharad Pawar