ముంబయి: బిజెపిని మోసం చేసినందుకు శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే తగిన గుణపాఠం నేర్చుకోవాలని కేంద్ర హోంమత్రి అమిత్‌షా అన్నారు. ముంబయిలోని బిజెపి నేతల సమావేశంలో కాషాయపార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్‌షా సోమవారం మాట్లాడుతూ.. రాజకీయాల్లో మనం ఏది సహించినా రాజకీయ ద్రోహాన్ని సహించకూడదన్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే శివసేన పార్టీ చీలిపోవడానికి బాధ్యతవహించాలని అమిత్‌షా పేర్కొన్నట్లు బిజెపి నేతలు తెలిపారు. ఉద్దవ్ దురాశే అతడికి చేటు తెచ్చింది. ఉద్దవ్ అత్యాశవల్లే అతడిపార్టీ సభ్యులు వ్యతిరేకులయ్యారన్నారు. శివసేన నేత ఏక్‌నాథ్ తిరుగుబాటుతో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ ప్రభుత్వం కూలిపోయింది. ఉద్దవ్ థాక్రే కేవలం బిజెపినే మోసం చేయలేదు. మహారాష్ట్ర ఇచ్చిన ప్రజలతీర్పును కూడా అవమానపర్చారని అమిత్‌షా అన్నారు. ఉద్దవ్ పదవీవ్యామోహంతోనే శివసేన కుంచించుకుపోయింది. ఉద్దవ్ హూకేకు ముఖ్యమంత్రి పదవిపై బిజెపి ఎటువంటి హామీ ఇవ్వలేదని అమిత్‌షా చేశారన్నారు.
Uddhav Thackeray Needs to be taught lesson: Amit Shah