Tuesday, April 1, 2025

నేడు ఢిల్లీకి ఉద్ధవ్.. ఇండియా కూటమి నేతలతో భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : శివసేన (యుబిటి) అధిపతి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్కరే మూడు రోజుల పర్యటనపై మంగళవారం న్యూఢిల్లీ వెళతారని, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలను కలుసుకుంటారని పార్టీ ఎంపి సంజయ్ రౌత్ సోమవారం ప్రకటించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల అనంతరం ఉద్ధవ్ థాక్కరే దేశ రాజధానికి వెళ్లడం ఇదేనని రౌత్ ఢిల్లీలో విలేకరులతో చెప్పారు.

‘ఇది చర్చల పర్యటన. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆయనను కలుసుకుంటారు. ఉద్ధవ్‌తో ఎఐసిసి మహారాష్ట్ర ఇన్‌చార్జి రమేష్ చెన్నితాలా చర్చలు జరుపుతారు. ఉద్ధవ్‌జీ తన ఢిల్లీ పర్యటనలో మరాఠీ, జాతీయ మీడియా సిబ్బందిని కలుసుకుంటారు’ అని రౌత్ తెలిపారు. మహారాష్ట్ర శాసనసభకు అక్టోబర్‌లో ఎన్నికలు జరగవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News