ముంబై: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జరిగే జనవరి 22న తాను, తన పారీ నాయకులు మహారాష్ట్రలోని నాసిక్‌లోగల కాలారామ్ ఆలయాన్ని సందర్వించి గోదావరి నది ఒడ్డున మహా హారతి ఇస్తామని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. అయోధ్య మహోత్సవానికి ఆహ్వానం అందని ఉద్ధవ్ థాక్రే శనివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడారు. తన తల్లి మీనా థాక్రే జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించిన అనంతరం ఆయన మటాడుతూ తనకు నచ్చినపుడు తాను అయోధ్యను సందర్శిస్తానని చెప్పారు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు. ఆ రోజున(జనవరి 22) సాయంత్రం 6.30 గంటలకు డాక్టర్ బాబాసాహెబ్ అబేద్కర్,
సంఘ సంస్కర్త సానె గురూజీ నిరసనలు తెలియచేసిన కాలారామ్ ఆలయాన్ని దర్శించి సాయంత్రం 7.30 గంటలకు గోదావరి నది ఒడ్డున మహా హారతి ఇస్తామని థాక్రే తెలిపారు. సాసిక్‌లోని పంచవటి రాంతంలో వెలసిన కాలారమ్ ఆలయం శ్రీరాముడికి చెందిన ఆలయం. నల్ల రాతితో చెక్కిన రాముడి విగ్రహం ఉండడం వల్ల ఆ ఆలయానికి ఆ పేరు వచ్చింది. వనవాస కాలంలో శ్రీరాముడు సీత, లక్ష్మణుడితో కలసి పంచవటి ప్రాంతలో నివసించాడని హిందువుల విశ్వాసం. ఆలయంలోకి దళితుల ప్రవేశాన్ని కోరుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ 1930లో కాలారామ్ ఆలయం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాగా..తన తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే జయంతి సందర్భంగా జనవరి 23న నాసిక్‌లో తమ పార్టీ ఒక ర్యాలీ నిర్వహిస్తుందని ఉద్ధవ్ తెలిపారు.