Sunday, January 19, 2025

రాహుల్ గాంధీకి ఉద్ధవ్ థాక్రే వార్నింగ్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: వీర్ సావర్కర్‌ను అవమానిస్తే ప్రతిపక్ష కూటమిలో చీలికలు తప్పవని శివసేన(యుబిటి) నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు. హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ తనకు ఆదర్శప్రాయుడని, ఆయనను అవమానించే వ్యాఖ్యలను మానుకోవాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఉద్ధవ్ థాక్రే సూచించారు.

ఆదివారం మహారాష్ట్రలోని మాలేగావ్‌లోఒక బహిరంగ సభలో ఉద్ధవ్ మాట్లాడుతూ సావర్కర్ అండమాన్ జైలులో 14 ఏళ్లు చిత్రహింసలు అనుభ వించారని, ఇదో రకమైన త్యాగమని అన్నారు. సావర్కర్‌ను కించపరిచే విధంగా రాహుల్ మాట్లాడడం మానకపోతే ప్రతపక్ష కూటమిలో చీలికలు ఏర్పడతాయని ఆయన హెచ్చరించారు. వీర్ సావర్కర్ తమ దేవుడని, ఆయనను అవమానిస్తే సహించేది లేదని ఉద్ధవ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News