Sunday, November 17, 2024

ఆర్‌ఎస్‌ఎస్‌ను బిజెపి రద్దు చేయవచ్చు: ఉద్దవ్ థాక్రే

- Advertisement -
- Advertisement -

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)ను బిజెపి రద్దు చేయవచ్చని శివసేన(యుబిటి) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అనుమానం వ్యక్తం చేశారు. శనివారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిజెపికి సంబంధించినంత వరకు ఆర్‌ఎస్‌ఎస్‌తో ఇక అవసరం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా అంటున్నారని తెలిపారు. తన శత జయంతి సంవత్సరంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రమాదంలో పడిందని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన(యుబిటి)ను నకిలీ సేన అని, తనను నకిలీ సంతానం(బాలాసాహెబ్ థాక్కేకు) అని మోడీ ఆరోపించారని, ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నకిలీగా ముద్ర వేసి ఆయన రద్దు చేయవచ్చని ఉద్దవ్ అనుమానం వ్యక్తం చేశారు. కాగా..శుక్రవారం సాయంత్రం ముంబైలో జరిగిన ఇండియా కూటమి బహిరంగ సభలో

ఉద్దవ్ ప్రసంగిస్తూ మహారాష్ట్రలో నిర్వహించిన బహిరంగ సభలలో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ తమను నకిలీ శివసేనగా అభివర్ణించారని చెప్పారు. ఎన్నికల తర్వాత ఏది అసలైన శివసేనో ఏది నకిలీ శివసేనో తేలిపోతుందని ఆయన స్పష్టం చేశారు. మోడీ కష్ట కాలంలో ఉన్నపుడు బాలాసాహెబ్ థాక్రే ఆయనకు అండగా నిలబడ్డారని ఉద్దవ్ గుర్తు చేశారు. అదే శివసేనను మోడీ నకిలీ అంటున్నారని, రేపు ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నకిలీ అనడానికి కూడా వెనుకాడరని ఆయన విమర్శించారు. బిజెపి అధ్యక్షుడు నడ్డా ఇటీవల ఒక ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఉద్దవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నడ్డా ఏమన్నారంటే&ప్రారంభంలో మా బలం చాలా స్వల్పం..అప్పుడు మాకు ఆర్‌ఎస్‌ఎస్ అవసరం. నేడు మేము ఎదిగాం..బలం పెంచుకున్నాం. బిజెపి తనకు తాను నడుస్తుంది..అప్పటికీ ఇప్పటికీ అదే తేడా అని నడ్డా వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News