న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో నేర్చుకోవడం, బోధించడానికి కేంద్రమైన యుడెమీ నేడిక్కడ, తన యుడెమీ బిజినెస్ ఇంటర్నేషనల్ కలెక్షన్(IC)కి హిందీ కోర్సులను జోడిస్తున్నట్లు ప్రకటించింది. క్రిటికల్ బిజి నెస్, టెక్నికల్ కోర్సులు వీటిలో ఉన్నాయి. ఇవి యూజర్ల భాషలో నిజ ప్రపంచ నిపుణులతో బోధించబడినవి.
ఇంటర్నేషనల్ కలెక్షన్ ద్వారా యుడెమీ బిజినెస్ ఎంటర్ ప్రైజ్ ప్లాన్ కస్టమర్‌లు 14 భాషల్లో 12,000 కంటే ఎ క్కువ కోర్సులకు యాక్సెస్‌ను కలిగి ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 43.6% భారతీయులు లేదా 52.83 కోట్ల మంది ప్రజలు మాట్లాడే హిందీతో సహా ఈ కోర్సులు అనేక రకాల కేటగిరీలను కలిగి ఉన్నాయి. లీడర్‌షిప్ & మేనేజ్‌మెంట్, డేటా సైన్స్, సేల్స్, ఐటి ఆపరేషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫైనాన్స్ & అకౌంటింగ్, మా ర్కెటింగ్ మరియు పర్సనల్ డెవలప్‌మెంట్ వంటివి వీటిలో ఉన్నాయి.
ఐసి అనేది యుడెమీ మార్కెట్‌ప్లేస్ జాగ్రత్తగా నిర్వహించే నిరూపిత కోర్సుల సముదాయం. తమ కోర్సులలో సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాలను పొందుపరిచే, స్థానికభాషలో మాట్లాడే, సబ్జెక్ట్ నిపుణులచే బోధించబడుతుం ది. అవి అభ్యాసకులకు మరింత సందర్భోచితంగా ఉపయోగపడుతాయి. ఈ సేకరణ కంటెంట్ డబ్బింగ్, ఆంగ్ల భాషా కోర్సుల వీడియో శీర్షికల సంప్రదాయ విధానానికి మించి, నాణ్యత, ప్రామాణికతను అధిక స్థాయిలో కలి గిఉంటుంది. పెరుగుతున్న టర్నోవర్, నిరంతర ఆటోమేషన్‌తో, సంస్థలు, నిపుణుల నుండి పెరుగుతున్న డి మాండ్‌ను తీర్చడానికి అనువైన ఆన్‌లైన్ శిక్షణ పరిష్కారాల కోసం ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. యుడెమీ బిజినెస్‌లో స్థానిక భాషలలో కోర్సులను జోడించడం వలన కంపెనీలు తాము కోరుకునే భాషలో ఉద్యోగులకు నైపుణ్యం, నైపుణ్యాన్ని పెంచే అవసరానికి అనుగుణంగా వేగాన్ని కొనసాగించడానికి వీలు కలుగు తుంది.
యుడెమీ బిజినెస్ కంట్రీ హెడ్ (భారతదేశం, దక్షిణాసియా) వినయ్ ప్రధాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “యుడెమీ చాలా కాలంగా స్థానిక నిపుణులచే రూపొందించబడిన స్థానిక-భాషా కోర్సులకు సంబంధించి పరిశ్రమ అతిపెద్ద సేకరణను అందించింది. కార్యాలయంలో వేగవంతమైన మార్పు ఉంటుంది, అక్కడ వ్యక్తులు నిరంతరం నైపుణ్యం, నైపుణ్యాన్ని పెంచుకోవడం అవసరం. సంస్థలు పోటీదాయకంగా ఉండేందుకు నేటి అనిశ్చి త ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యాల అంతరాలను తొలగించడం అవసరం. నేర్చుకోవడానికి భాష ఒక అవ రోధంగా ఉండకూడదు, అందుకే మేం ఆసియా-పసిఫిక్‌లోని వేలాది కంపెనీలకు నిజమైన స్థానికీకరించిన అభ్యాస అనుభవాలను అందిస్తాం’’ అని అన్నారు.
హిందీలో యుడెమీ బిజినెస్ అందించే కొన్ని కోర్సులలో పైథాన్ ఫర్ బిగినర్స్- లెర్న్ పైథాన్ ప్రోగ్రామింగ్, అండర్ స్టాండ్ మాన్యుఫ్యాక్చరింగ్ డ్రాయింగ్ క్విక్ & కరెక్ట్, ఇంట్రడక్షన్ టు ఎస్ఇఒ బేస్డ్ కంటెంట్ రైటింగ్, డేటా అనలిస్ట్ స్కిల్ పాత్, టెక్నికల్ అనాలిసిస్: హార్మోనిక్ & సెయింట్ చార్ట్ ప్యాటర్న్, స్టాక్ ట్రేడింగ్ వంటివి ఉన్నాయి.
యుడెమీ బిజినెస్ ప్రస్తుతం హిందీలో 100 కంటే ఎక్కువ కోర్సులను అందిస్తోంది, భవిష్యత్తులో ఈ సేకరణను విస్తరించడం కొనసాగిస్తుంది. హిందీతో పాటు, యుడెమీ బిజినెస్ ఐసి లో అరబిక్, బహాసా ఇండోనేషియన్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, మాండరిన్, పోలిష్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, టర్కిష్‌లలో కోర్సులు ఉన్నాయి. మార్కెట్ డిమాండ్, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ మరియు Udemy.comలోని యుడెమీ మార్కెట్ ప్లేస్‌లో ఉత్పత్తి చేయబడిన అధిక-నాణ్యత కంటెంట్ సరఫరా ఆధారంగా భాషలు ఎంపిక చేయబడతాయి. యుడెమీ మార్కెట్‌ప్లేస్ భారతదేశంలోని తమిళం, తెలుగు వంటి ఇతర ప్రాంతీయ భాషలతో సహా దాదాపు 75 భాషలలో 200,000 కంటే ఎక్కువ కోర్సులను కలిగి ఉంది.
నేర్చుకునే వారి భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం, నేర్చుకోవడంలో వ్యక్తుల ఆసక్తిని పెంపొందించడం, నేర్చుకోవడాన్ని ప్రతి ఒక్కరికీ మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నేర్చుకోవడంతో జీవితాలను మెరుగుపరచడం కోసం యుడెమీ తన లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఐసీ సహాయపడుతుంది. యుడెమీ బిజినెస్ ఇంటర్నేషనల్ కలెక్షన్ గురించి మరింత తెలుసుకోవడానికి, business.udemy.comని సందర్శించండి.