Friday, November 22, 2024

ఏ భాష ఆ భాషే ..హిందీ బంధం ఎందుకు?: ఉదయనిధి

- Advertisement -
- Advertisement -

చెన్నై : హిందీతో దేశ సమైక్యత పటిష్ట మవుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం హాస్యాస్పదం అని డిఎంకె నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. కేవలం నాలుగయిదు రాష్ట్రాలలో మాట్లాడే భాషతో దేశ ఐక్యత ఏ విధంగా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. అమిత్ షా హిందీ దివస్‌లో చేసిన ప్రసంగం కేవలం ఇతర భాషల వారిపై హిందినీ రుద్దడానికే అని విమర్శించారు. ప్రతిసారి లాగానే ఇప్పుడు కూడా అమిత్ షా హిందీ తరఫున ప్రచారానికి దిగారని , తమిళనాడులో తమిళం, కేరళలో మలయాళం పలు ఇతర రాష్ట్రాలలో వేరే భాషలు మాట్లాడుతారు.

భాషలతో రాష్ట్రాలు కలియడం ఏమిటీ? దీని వల్ల రాష్ట్రాలకు అవసరం అయిన సాధికారికత ఏదైనా సిద్ధిస్తుందా? అని ప్రశ్నించారు. హిందీ పరిచయం లేని రాష్ట్రాలలో హిందీని బలవంతంగా ప్రవేశపెట్టడానికి కేంద్ర హోం మంత్రికంకణం కట్టుకున్నట్లుగా ఉందని సిఎం స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి చెప్పారు. దేశంలో పాతుకుపోయిన సనాతన ధర్మంతో సామాజిక వ్యవస్థ దెబ్బతిందని, ఇది అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి అని ఇటీవలే ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News