చెన్నై: హిందీ భాషను రుద్దడాన్ని తిప్పికొట్టేందుకు తమిళులు తమ పిల్లలకు తమిళ పేర్లే పెట్టాలని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రజలని కోరారు. ‘వారు కొత్త విద్యా విధానం ద్వారా హిందీని రుద్దాలని చూస్తున్నారు’ అన్నారు. నూతన దంపతులు తమ పిల్లలకు తమిళ పేర్లే పెట్టి హిందీని తిప్పి కొట్టాలని కోరారు. తమిళనాడు ఎన్నటికీ హిందీని స్వీకరించదన్నారు. ‘‘ ఒకరు తమిళనాడు పేరునే మార్చేయాలని ఇప్పటికే యత్నించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా అభ్యంతరాలు రావడంతో అతడు క్షమాపణలు కోరారు. డిఎంకె ఉన్నంత వరకు, తమిళుడు బతికున్నంత వరకు ఎవరూ తమిళ్, తమిళనాడు, ద్రావిడం వంటి పదాలను తుడిచేయలేరు. తమిళనాడు ఎన్నటికీ హిందీ రుద్దడాన్ని ఆమోదించదు’’ అన్నారు.
తన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నూతన దంపతులు 16 మంది పిల్లలను కని, లోక్ సభలో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని కాపాడాలని కోరిన మరునాడే, ఉదయనిధి స్టాలిన్ హిందీ రుద్దడాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.