Sunday, December 22, 2024

పవన్ కళ్యాణ్ కు ఉదయనిధి స్టాలిన్ ‘చూద్దాం..’అంటూ దీటైన జవాబు!

- Advertisement -
- Advertisement -

చెన్నై/న్యూఢిల్లీ: గత ఏడాది సెప్టెంబర్ లో  డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం ఓ మలేరియా, డెంగ్యూ వంటిదని దానిని ఏరిపారేయాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ గురువారం ‘‘సనాతన ధర్మంను ఎవరూ తుడిచేయలేరు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఓ పటిష్టమైన జాతీయ చట్టం తీసుకురావాలి. దానిని దేశమంతటా అమలు చేయాలి. సనాతన ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తారో వారిపట్ల సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలి’’ అన్నారు.

పవన్ కళ్యాణ్ అన్నది ఉదయనిధిని ఉద్దేశించి కానప్పటికీ ఆయన దానిని తనపై చేసిన విమర్శగా భావించి ‘‘వేచి చూడండి’’ అని  జవాబిచ్చాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ వాడిన పదజాలం జగన్ మోహన్ రెడ్డినే అయినప్పటికీ, ఉదయనిధి పేరును ప్రస్తావించకపోయినప్పటికీ, కొంత తమిళంలో మాట్లాడినందుకు అది ఉదయనిధిని ఉద్దేశించి అన్నారనే కొందరు భావించారు. దానికి డిఎంకె కూడా తగిన విధంగా బదులిచ్చింది.

డిఎంకె ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లాహ్ మాట్లాడుతూ ‘‘మేము, మా పార్టీ ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ మేము కుల దౌర్జన్యాలు, అంటరానితనం, కుల పెత్తనంకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆపం’’ అన్నారు. వాస్తవానికి 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని విమర్శించారు. సనాతన ధర్మం ఓ వైరస్ వంటిదన్నారు.

పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడాక డిఎంకె శుక్రవారం ప్రతిస్పందించింది. ‘‘కులం, అంటరానితనం…వంటి వాటి విషయంలో తమది పెరియార్ రామస్వామి పంథా అని, దురాచారాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుంది’’ అని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News