Wednesday, January 22, 2025

మీ కొడుకు ఎన్ని రన్స్ చేశాడో ?

- Advertisement -
- Advertisement -

చెన్నై : కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా విమర్శలకు దిగారు. తమిళనాడులో రాజకీయ వారసత్వపు పార్టీగా డిఎంకె ఉందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి సూటి ప్రశ్న సంధించారు. ‘ మీ కుమారుడు జయ్ షా క్రికెట్‌లో ఎన్ని పరుగులు చేశాడని ఆయనకు ఏకంగా క్రికెట్ బోర్డు బిసిసిఐ కార్యదర్శి పదవిని కట్టబెట్టారని నిలదీశారు. డిఎంకె వంశపాలనల పార్టీ అనే వాదనను తిప్పికొట్టారు.

చైన్నెలో ఆదివారం జరిగిన డిఎంకె యువజన విభాగం నూతన కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ఇప్పుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్ సిఎం అయ్యారు. ఇక ఉదయనిధిని సిఎం చేసేందుకు పార్టీ నేతలు నడుం బిగుస్తారని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మా సంగతి ఎందుకు కానీ మీ కుమారుడు బిసిసిఐ సెక్రెటరీ ఏ విధంగా అయ్యారని ప్రశ్నించారు. ఆయన ఎన్ని క్రికెట్ మ్యాచ్‌ల్లో పాల్గొన్నారు? ఎన్ని రన్స్ చేశాడో చెపుతారా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News