- Advertisement -
చెన్నై: నిధుల కేటాయింపు విషయంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తమిళనాడు మంత్రి, డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ తప్పు పట్టారు. రాష్ట్రం పన్నుగా చెల్లించిన మొత్తంలో 28 పైసలను మాత్రమే కేంద్రం ఇచ్చిందని, బిజెపి పాలిత రాష్ట్రాలు ఎక్కువ మొత్తంఅందుకున్నాయని ఆయన ఆరోపించారు. రామనాథపురం, థెనిలలో వేర్వేరు ర్యాలీలలో ప్రసంగించిన ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
‘ఇక మీదట ప్రధానిని మనం ’28 పైసల పిఎం’ అని పిలవాలి’ అని ఆయన అన్నారు. ఆయన బిజెపి నేతృత్వంలోని కేంద్రంపై విమర్శలను కొనసాగించారు. తమిళనాడులో పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని ఉదయనిధి ఆరోపించారు.
- Advertisement -