Sunday, December 22, 2024

వాష్ రూమ్‌లో విద్యార్థినిపై వీడియో చిత్రీకరణ … కుష్బూ సమగ్ర దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

మంగళూరు : ఉడుపి లోని పారామెడికల్ కాలేజీలో వాష్‌రూమ్‌లో విద్యార్థినిపై తోటి ముగ్గురు విద్యార్థినులు వీడియో చిత్రీకరించే సంఘటనపై నటి, మహిళా జాతీయ కమిషన్ (ఎన్‌సిడబ్లు) సభ్యురాలు కుష్బూ సుందర్ దర్యాప్తును సమీక్షించారు. డిప్యూటీ కమిషనర్ విద్యాకుమారి, ఎస్‌పి హాకయ్ అక్షయ్ మచ్చీంద్రలతో కేసు పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ పోలీస్‌లు సమగ్రంగా దర్యాప్తు సాగిస్తున్నా ఇంతవరకు సరైన సాక్షం లభించలేదని పేర్కొన్నారు. సరైన సాక్షం లభించనంత వరకు చార్జిషీటు దాఖలు చేయడం కుదరదని పేర్కొన్నారు. గురువారం తాను ఆ కాలేజీని సందర్శించానని, ముగ్గురు విద్యార్థినుల మొబైల్ ఫోన్లు డేటా పరిశీలనకు పోలీస్‌లు పంపారని చెప్పారు. నిందితులు ఏ సామాజిక వర్గం వారన్న కోణంతో నిమిత్తం లేకుండా మహిళలను రక్షించడమే లక్షంగా దర్యాప్తు జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News